మూడవ వన్ డే లో భారత్ ఘన విజయం ; 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్

by | Feb 12, 2025 | వార్తలు

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ, ఆఖరి వన్ డే లో భారత జట్టు, ఇంగ్లాండ్ పై 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

మూడు మ్యాచ్ ల సిరీస్ భారత జట్టు 3-0 తో గెలుచుకుంది.  అంతకు ముందు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టి 20 సిరీస్ ను భారత్ 4-1 తో గెలుచుకుంది.

ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది

357 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల నిలకడ లేమి మూడవ వన్ డే లోనూ కొనసాగింది.  ఇంగ్లాండ్ జట్టు 34.2 ఓవర్ లలో 214 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

ఒక్క ఇంగ్లాండ్ ఆటగాడు, కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో టాప్ స్కోర్ బాంటన్ చేసిన 38 పరుగులే

భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ లు తలా రెండు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ లు చెరో  వికెట్ తీశారు

అంతకు ముందు, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 356 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  ఇంగ్లాండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యం ఉంచిన భారత్

గత మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు.

 వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ రెండవ వికెట్ కు 116 పరుగులు జోడించిన తరవాత, విరాట్ కోహ్లీ 52 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.  ఛాంపియన్స్ ట్రోఫీ ముందు,  సీనియర్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లో కి రావడం శుభ పరిణామం

ఆ తరవాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, గిల్ మూడవ వికెట్ కు 104 పర్గులులు జోడించారు. అయితే గిల్ సెంచరీ చేసి 112 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు

ఆ తరవాత కొద్దీ సేపటికే శ్రేయాస్ అయ్యర్ 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  రాహుల్ 29 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

పాండ్య 17 పరుగులు, అక్షర్ పటేల్ 13 పరుగులు,సుందర్ 14 పరుగులు, హర్షిత్ రానా 13 పరుగులు చేశాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ రషీద్ 4 వికెట్లు తీయగా, వుడ్ 2 వికెట్లు తీయగా, రూట్, అట్కిన్సన్, మహమూద్ తలా ఒక వికెట్ తీశారు