పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కానుండగా, విడుదల తేది దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘మాట వినాలి’ అనే మొదటి సింగిల్, ‘కొల్లగొట్టినాదిరో’ అనే సెకండ్ సింగిల్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఇక తాజాగా, ఈ సినిమాలోని మూడో పాటకు సంబంధించిన సాలిడ్ అప్‌డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ల మధ్య రూపొందిన డ్యూయెట్ సాంగ్ ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇందులో 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ (Pawan Kalyan) అభిమానులను అలరించనున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారు చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే డబ్బింగ్ పార్ట్‌ను కూడా ఇటీవలే ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు చివరి షెడ్యూల్ ప్రస్తుతం ఖమ్మంలో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుంది. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) పేరుతో విడుదల కానుంది.

