గేమ్ చేంజర్ పాటలకు 75 కోట్లా

by | Jan 2, 2025 | సినిమా

భారీతనానికి పెట్టింది పేరు శంకర్.  గతం లో ప్రపంచంలో ఏడు వింతలను పాటలలో చూపించారు. ఇప్పుడు చాలా రోజుల తరవాత శంకర్ మార్క్ పాటలను గేమ్ చేంజర్ లో చూస్తాం.  ఈ విషయంపై ఫిలిం క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తరన్ ఆదర్శ్ పోస్ట్ చూస్తే, గేమ్ చేంజర్ లో నాలుగు పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టారట. ప్రతి పాటకి ఒక ప్రత్యేకత ఉందట.

ఒక్కో పాటకు ఒక్కో కొరియోగ్రాఫర్.   జరగండి, జరగండి పాటకు ప్రభుదేవా, రా మచ్చ సాంగ్ కు గణేష్ ఆచార్య,   ‘ధోప్’ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

అయితే పాత చిత్రీకరణ లో కూడా ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంది.  అదేంటో తెలియాలంటే తరన్ ఆదర్శ్ పోస్ట్ చేసిన ఈ ఇమేజ్ చూడండి, చదవండి