దర్శకుడు శంకర్ గేమ్ చేంజ్ – ఆస్తులను అటాచ్ చేసిన ED

by | Feb 20, 2025 | వార్తలు

దర్శకుడు శంకర్ గేమ్ చేంజ్ – 10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED

దర్శకుడు శంకర్ రోబో చిత్రాన్ని తన జిగుబ కధ నుండి కాపీ చేశారని రచయిత ఆరూర్ తమిళ్ నాథన్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు.  2011 లో రచయిత తమిళ్ నాథన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ప్రారంభించింది

ఇప్పుడు, FTII (Film and Television Institute of India) నివేదిక ప్రకారం శంకర్ దర్శకత్వం వహించిన రోబో చిత్రానికి, రచయిత ఆరూర్ తమిళ్ నాథన్ పుస్తకం జిగుబ కి దగ్గర పోలికలున్నాయని తెలిపింది. అంతే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో కూడా శంకర్ కాపీ చేసినట్టు తేలింది

రజనీకాంత్ నటించిన రోబో అప్పట్లో 290 కోట్ల రూపాయల వసూళ్ళని సాధించింది. రోబో చిత్రానికి శంకర్ రెమ్యూనరేషన్ 11.5 కోట్లు. ఇప్పుడు, ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద, శంకర్ కు చెందిన 10 కోట్లు విలువ చేసే మూడు ఆస్తులను Enforcement Directorate అటాచ్ చేసింది