ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ 49.5 వర్ల లో 217 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
326 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫిల్ సాల్ట్ 9 పరుగులు , జెమీ స్మిత్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు
అయితే మరో ఓపెనర్ బెన్ డకెట్, జో రూట్ తో కలిసి మూడవ వికెట్ కు 68 పరుగులు జోడించారు. బెన్ డకెట్ 38 పరుగులు చేసి అవుట్ అవగా, ఆ తరవాత వచ్చిన బ్రూక్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ బట్లర్, జో రూట్ తో ఐదవ వికెట్ కు 83 పరుగులు జోడించారు 38 పరుగులు చేసిన బట్లర్, 10 పరుగులు చేసిన లివింగ్ స్టోన్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. , అయితే జో రూట్ మాత్రం మరో వైపు గోడలా నిలబడి పోయాడు. ఏడో వికెట్ కు జో రూట్, ఓవర్టన్ లు 54 పరుగులు జోడించారు. సెంచరీ చేసిన జో రూట్ చివరకు 111 బంతుల్లో 120 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
జో రూట్ కు చక్కని సహకారం అందించిన ఓవర్టన్ 28 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ఆర్చర్ 14 పరుగులు, రషీద్ 5 పరుగులు చేసి అవుట్ అవడంతో ఇంగ్లాండ్ కధ ముగిసింది
ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో ఓమర్జాయ్ 5 వికెట్లు తీయడం ఆటలో విశేషం. నబి రెండు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, ఫారూఖీ, నయిబ్ చెరో ఒక వికెట్ తీశారు
‘అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్తాన్ బలహీనమైన ఇంగ్లాండ్ బౌలింగ్ పై 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘానిస్తాన్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్ఠాలలో పడింది. గుర్బాజ్ 6 పరుగులు, అటల్ 4 పరుగులు, రెహ్మాత్ షా 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు
అయితే ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ షాహిదీ నాలుగవ వికెట్ కు 103 పరుగులు జోడించారు.
40 పరుగులు చేసిన షాహిదీ అవుట్ అయ్యాక, ఓమర్జాయ్ తో కలిసి ఇబ్రహీం జద్రాన్ ఐదవ వికెట్ కు 72 పరుగులు జోడించారు. 41 పరుగులు చేసి ఓమర్జాయ్ అవుట్ అయ్యారు.
ఆ తరవాత వచ్చిన నబి తో ఇబ్రహీం జద్రాన్ ఆరవ వికెట్ కు 111 పరుగులు జోడించిన తరవాత ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జద్రాన్ 177 పరుగుల ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. నబి 24 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు తీసుకోగా, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఓవర్టన్,రషీద్ చెరో ఒక వికెట్ తీశారు
నిన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం వలన ఇవాళ్టి మ్యాచ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ పై 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఛేదన జో రూట్ క్రీజ్ లో ఉన్నంతవరకు ఇంగ్లాండ్ వైపు మొగ్గు చూపింది.


