ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

by | Jan 7, 2025 | వార్తలు

కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ ఎన్నికలను  ఫిబ్రవరి 5 న నిర్వస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  ఫిబ్రవరి 8 న ఓట్ల లెక్కింపు చేపడతారు.  అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు తెలిపారు

నోటిఫికేషన్ విడుదల చేసే తేదీ                      : 10th January

నామినేషన్ల సమర్పణకు గడువు                      : 17th January

నామినేషన్ల వెరిఫికేషన్                                    : 18th January

నామినేషన్ల ఉపసంహరణకు గడువు                : 20th January

పోలింగ్ డేట్                                                    : 5th February

ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల                   : 8th February

ఢిల్లీ లో మొత్తం ఓటర్ల సంఖ్య 1.55 కోట్లు.  ఢిల్లీ లో మొత్తం ఓటర్ల సంఖ్య 1.55 కోట్లు. వీరిలో రెండు లక్షల ఎనిమిది వేల మంది తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

మొత్తం 13033 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయనున్నారు.  85 ఏళ్ళు పై బడిన వారికి ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పించబోతున్నారు