ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా గా, సుమారు 55 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కే టి ఆర్ పై ఎ సీబీ ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించింది. ఈ కేసులో కే టి ఆర్ ను A1 గా, ఐ ఎ ఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ ఎమ్ డి ఏ ఇంజనీర్ ని A3 గా కేసు నమోదు చేశారు.
దీనికి సంబందించి కే టి ఆర్, హై కోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.
కే టి ఆర్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హై కోర్ట్ ఈ రోజు తీర్పు వెలువరించింది.
ఏ సి బి వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్ట్ , కే టి ఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. హై కోర్ట్, కె టి ఆర్ అరెస్ట్ పై స్టే ఎత్తివేసినట్లయింది
ఈ తీర్పు మీద, బి ఆర్ ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. హై కోర్ట్ తీర్పును, కె టి ఆర్ న్యాయవాదులు సుప్రీమ్ కోర్ట్ లో సవాలు చేసే అవకాశం ఉంది.
హై కోర్ట్ తీర్పు తరవాత, మరో సారి ఏ సి బి, కె టి ఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనే అవకాశం ఉంది. ఇక, విచారణను దూకుడుగా, మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

