దురంధర్. లేటెస్ట్ బాలీవుడ్ సెన్సషనల్ హిట్. ఒకే భాషలో అత్యధికంగా సుమారు 1240 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దంగల్, రెండవ స్థానంలో బాహుబలి, మూడవ స్థానంలో పుష్ప-2 ఉన్నాయి
అంతే కాకుండా ఇండియా లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా 844 కోట్లతో చరిత్ర సృష్టించింది. పుష్ప-2 పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది దురంధర్.
దురంధర్ అరబ్ దేశాలలో, పాకిస్థాన్ లో విడుదల కాలేదు. దురంధర్ సినిమాను ఈ దేశాలలో విడుదల చేయడానికి నిర్మాతల మండలి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది
ప్రస్తుతం ఆరవ వారంలో అడుగు పెట్టిన దురంధర్, 36 వ రోజు 3.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. విడుదలైన తరవాత అతి తక్కువ వసూళ్లు సాదించండం 36 వ రోజే. ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదల ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. రాజాసాబ్ మొదటి రోజు 6 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే రాజాసాబ్ టాక్ అంత ఆశాజనకంగా లేకపోవడం దురంధర్ కు కొంత కలిసొచ్చే అంశం. దురంధర్ వసూళ్ల తగ్గుముఖం రాజాసాబ్ ప్రభావమా లేక సహజంగా తగ్గుతున్నాయి అనే విషయం ఆరో వారంలో తెలిసిపోతుంది
ప్రస్తుతానికి దురంధర్ ఇండియా లో 844.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. నాలుగవ వారం నుండి ఐదవ వారానికి వసూళ్లు సగానికి సగం తగ్గాయి. ఆరవ వారంలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. వారాంతానికి వసూళ్లు పెరగవచ్చు. దురంధర్ ఫుల్ రన్ లో 860 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. గల్ఫ్, అరబ్ దేశాలలో విడుదల చేస్తే వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
దురంధర్ వసూళ్లు
- మొదటి వారం : 218.00 కోట్లు
- రెండవ వారం : 261.50 కోట్లు
- మూడవ వారం : 189.30 కోట్లు
- నాలుగవ వారం : 115.70 కోట్లు
- ఐదవ వారం : 56.30 కోట్లు
- ఆరవ వారం : 3.60 కోట్లు (శుక్రవారం)

