1st Day : 100 కోట్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన The Rajasaab

by | Jan 10, 2026 | సినిమా

డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ (The Rajasaab) సినిమా సందడి జనవరి 8 న ప్రీమియర్ల తోనే మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి.  ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ గా రూపొందించిన రాజాసాబ్ చిత్రానికి మొదటి రోజు  నెగటివ్ టాక్ వచ్చింది.  ప్రభాస్ అభిమానులు మాత్రం దర్శకుడు మారుతి మీద తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.  రాజాసాబ్ వసూళ్లు ప్రభాస్ స్టామినాకు నిదర్శనం

స్కాన్ లింక్ ప్రకారం రాజాసాబ్ (Rajasaab) మొదటి రోజు అన్ని బాషలలో కలిపి ఇండియా లో 54.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ 54 కోట్లలో 47 కోట్లు తెలుగు బాషా నుండి వచ్చాయి.  రాజా సాబ్ హిందీ వెర్షన్ 6 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.  జనవరి 8 ప్రీమియర్ షో ల ద్వారా 9 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాడు.

మొత్తంగా రాజాసాబ్ ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలిపి ఇండియా నెట్ వసూళ్లు 63.3 కోట్లు

ఓవర్సీస్ వసూళ్లు 26 కోట్లతో కలిపి, డార్లింగ్ ప్రభాస్ (Prabhas) రాజాసాబ్ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు.  నెగటివ్ టాక్ తో డార్లింగ్ ప్రభాస్ మొదటి రోజు 100 కోట్లు కొల్లగొట్టాడు అంటే పాజిటివ్ టాక్ వస్తే బాహుబలిని ఆపడం ఎవరితరం.