ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది
నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల్లో హ్యాట్రిక్ కొడితే, నేడు చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ కొట్టింది
184 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు మొదటి నుండి అన్ని కష్టాలే
చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది. రచిన్ రవీంద్ర 3 పరుగులు, కాన్వే 13 పరుగులు, కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు, జడేజా 2 పరుగులు, శివమ్ దూబే 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు
74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ను విజయ్ శంకర్, ధోని కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే బౌండరీలు రావడం కష్టంగా మారింది. వీరిద్దరూ సింగిల్స్ తీయడానికే పరిమితమయ్యారు. అప్పటికే కావాల్సిన రన్ రేట్ పెరిగిపోతూ వచ్చింది. 17 ఓవర్ల కే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖాయమైంది.
ఆట ఆఖరుకు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసి విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది. విజయ్ శంకర్ 69 పరుగులతో, ధోని 30 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు అజేయంగా 84 పరుగులు జోడించారు
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు
అంతకు ముందు, మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్ల లో 6 వికెట్లు నష్టానికి 183 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్ గుర్క్ డక్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ పోరెల్ తో కలిసి మరో ఓపెనర్ కె ఎల్ రాహుల్ రెండవ వికెట్ కు 54 పరుగులు జోడించారు
33 పరుగులు చేసి అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యిన తరవాత కెప్టెన్ అక్షర్ పటేల్ తో కలిసి కె ఎల్ రాహుల్ మూడవ వికెట్ కు 36 పరుగులు జోడించిన తరవాత అక్షర్ పటేల్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన సమీర్ రిజ్వి, కె ఎల్ రాహుల్ లు నాలుగవ వికెట్ కు 56 పరుగులు జోడించాక సమీర్ రిజ్వి అవుట్ అయ్యాడు. ఆ తరవాత 51 బంతుల్లో 77 పరుగులు చేసిన కె ఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. చివర్లో స్టబ్స్ ధాటిగా ఆడి 12 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్, జడేజా, పతిరానా లు తలా ఒక వికెట్ తీశారు

