రజనీకాంత్ ‘కూలీ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

by | Feb 27, 2025 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో (Rajanikanth) పాటు కింగ్ నాగార్జున, శృతి హాసన్ (Shruthi Hasan), కన్నడ స్టార్ ఉపేంద్ర, (Upendra) సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే బుట్టబొమ్మ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కాగా, తాజాగా ‘కూలీ’ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే టీజర్‌ను కట్ చేశారట. ఈ క్రమంలోనే మూవీ టీజర్‌ను (Teaser) మరో రెండు వారాల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మార్చి 14న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున ‘కూలీ’ టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో చెన్నై శివార్లలో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ రజనీకాంత్ మీద కొన్ని స్పెషల్ ఫైట్ సీన్స్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.