సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 2026 నుండి సరికొత్త విద్య విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
2026 నుండి పదవ తరగతి పరీక్షలను (10th Class Exams) రెండు సార్లు రాసే అవకాశం కల్పిస్తోంది. అయితే మొదటి సారి ఫిబ్రవరిలో, రెండవ సారి మే లో పరీక్షలు జరుగుతాయి.
సీబీఎస్ఈ ఆమోదం పొందిన ఈ నూతన విద్యావిధానం గురించిన పబ్లిక్ నోటీసు ను తన అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. అయితే దీనికపై ప్రజల అభిప్రాయాలను, సూచలను ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను, సూచనలు, సలహాలను తీసుకోనుంది. మార్చ్ 9 వరకు వచ్చిన అభిప్రాయాలను, సూచనలను, సలహాలను, ఏమైనా అభ్యంతరాలున్న వాటిని పరిగణనలోకి తీస్కుని అప్పుడు ఈ సరికొత్త విద్య విధానానికి సీబీఎస్ఈ ఆమోద ముద్ర వేయనుంది
అయితే ఈ విద్య విధానం విద్యార్థులను కొంత గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది.
ఈ విధానం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా తెలియడం లేదు. రెండు సార్లు పరీక్షల నిర్వహణ అనేది కూడా సీబీఎస్ఈ, స్కూల్ యాజమాన్యాలకు నిర్వహణ భారం అదికూడా బాగా ఎండలు మండే మేలో. అంతే కాకుండా, పిల్లలు రెండు సార్లు ఎగ్సామ్ ప్రిపరేషన్ కు సిద్ధంగా ఉండకపోవచ్చు.
మార్చ్ 9 న ప్రజాభిప్రాయ సేకరణ తరవాత, ఈ నూతన విద్య విధానం అమలు అవుతుందో లేదో అన్న విషయం తెలుస్తుంది

