‘హిట్-3’ టీజర్ తేదీని ఫిక్స్ చేసిన నాని!
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘హిట్’: ది థర్డ్ కేస్’. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు.












