నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా సంగీత దర్శకుడు తమన్‌కు ఓ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇచ్చాడు. దాని ధర దాదాపు కోటీన్నర వరకు ఉంటుంది. బాలయ్య అంతపెద్ద గిఫ్ట్ ఇవ్వడం తమన్‌తో పాటు అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ గిఫ్ట్ ఇవ్వడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఇటీవల బాలయ్య నటించిన సినిమాలన్నింటికి తమనే సంగీతం అందిస్తున్నాడు. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి సినిమాలన్నీ బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ వరుస విజయాలకు తమన్ అందించిన మ్యూజిక్ ముఖ్య కారణమని భావించిన బాలయ్య కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఇచ్చిన బహుమతికి అఖండ 2 ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపీ ఆచంట డబ్బులు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తన రెమ్యునరేషన్‌లో కొన్ని డబ్బులు తీసేసి వాటితో కారు కొనివ్వమని బాలయ్య నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. అఖండ 2కి బాలయ్య రూ.35 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన గత చిత్రం డాకు మహారాజ్‌కి రూ.28 కోట్ల పారితోషికం అందుకున్న బాలయ్య అఖండ 2 కోసం రూ.7 కోట్లు ఎక్కువగా తీసుకోనున్నాడు. ఈ పెంచిన డబ్బులలో నుంచే తన రెమ్యునరేషన్ కట్ చేసుకొని మరీ బాలయ్య, తమన్ కు కారు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలయ్య తమన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తమన్ తనకు సోదరుడితో సమానమని చెప్పిన బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఇచ్చిన తమ్ముడికి తాను ప్రేమతో ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

