సన్నీడియోల్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం బోర్డర్ 2. 28 ఏళ్ళ క్రితం భారత, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం బోర్డర్ కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకుడు. 1997 లోవచ్చిన బోర్డర్ ను జె పి దత్తా తెరకెక్కించారు. బోర్డర్ 2 లో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషించాడు
సంక్రాంతి కానుకగా బోర్డర్ 2 చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23 న విడుదల చేస్తున్నారు.

