దేశ రాజధాని ఢిల్లీ లో కమలం వికసించేనా

by | Jan 28, 2025 | రాజకీయాలు

భారతీయ జనతా పార్టీ మూడు సార్లు కేంద్రంలో అధికారం చేజిక్కించుంకుంది.  నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గా మూడవ సారి బాధ్యతలు చేపట్టారు.  అయితే దేశ రాజధాని ఢిల్లీ లో భాజపా పాగా వేయలేకపోయింది.  మరి ఈ సారి కమలం వికసించేనా.

1999 కి ముందు భాజపా ఢిల్లీ పీఠం దక్కించుకున్నా, 1999 తర్వాత అంటే సుమారు 26 సంవత్సరాలు ఢిల్లీ లో పాగా వేయలేకపోయింది

1999 నుండి 2013 వరకు అంటే, 15 సంవత్సరాల పాటు ఢిల్లీ ని పాలించింది కాంగ్రెస్ పార్టీ.  అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 15 సంవత్సరాలపాటు పాలించిన రికార్డు సృష్టించారు.

ఆ తరవాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.  2013 నుండి ప్రస్తుతం వరం ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉంది.  అయితే 2014-15 మధ్యలో ఒక సంవత్సరం రాష్ట్రపతి పాలన విధించారు.  ఈ మధ్య కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సందర్భంలో అతిశి సుమారు 120 రోజులు పరిపాలించారు.

ఇప్పుడు ఫిబ్రవరి 5 న ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. భాజపా కి ఇదే సరైన సమయం.  26 సంవత్సరాల తరవాత వచ్చిన ఈ అవకాశాన్ని భాజపా అందిపుచ్చుకుంటుందో, లేదో చూడాలి.

ఢిల్లీ ప్రజలు ప్రతి పార్టీ కి  3 సార్లు అవకాశం ఇస్తున్నారు.  ఈ లెక్కన ఆప్ కి మరో ఛాన్స్ ఇస్తారా లేదా అధికార బలాన్ని ఉపయోగించి భాజపా ఢిల్లీ పీఠం పై పట్టు సాధిస్తుందా అనేది వేచి చూడాలి

ఆప్ మేనిఫెస్టో మహిళలు, విద్యార్థులు లక్ష్యంగా రూపొందించింది.  .  భాజపా యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం పెట్టుకుంది. అయితే 70 నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీ లో దళిత ఓటర్ల ప్రభావం 30 నియోజక వర్గాల్లో ఉంటుంది.  ఎందుకంటె, 2011 జనాభా లెక్కల ప్రకారం,  ఢిల్లీ జనాభాలో 16% దళితులు ఉన్నారు. ఇప్పటికి సుమారు 20-25% ఉండవచ్చని అంచనా.

అయితే గత ఎన్నికల్లో ఆప్ గెలవడానికి కారణం, ఆ పార్టీ కి దళితుల మద్దతు లభించడం. ఈ సారి కూడా కేజ్రీవాల్ దళితుల పట్ల నమ్మకంతో ఉన్నారు.  భాజపా దళిత నియోజక వర్గాల్లో, దళిత నియోజక వర్గాల్లో పట్టు సాధించడానికి, అమిత్ షా నేతృత్వంలో  వ్యూహాలు రచిస్తోంది.

పేరుకు ముక్కోణపు పోటీ అయినా, ఈ పోటీ ప్రధానంగా ఆప్, భాజపా ల మధ్యే అని విశ్లేషకుల అభిప్రాయం.  కాంగ్రెస్ ఈ సారి అంత దూకుడుగా కనిపించడం లేదు.

భాజపా, ఆప్ ల మేనిఫెస్టో లో కొన్ని కామన్ గా ఉన్నాయి.

  • ముఖ్యంగా యమునా నది సుద్ధి చేయడం
  • యువతకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు
  • ఉచిత బస్సు ప్రయాణం,
  • సీనియర్  సిటిజన్స్ కు ఉచిత వైద్యం

అరవింద్ కేజ్రీవాల్ పై భాజపా పెట్టిన కేసులు ఆప్ పార్టీ కి సింపతీ ఓట్లు తెస్తాయా లేదా భాజపా కొంప ముంచుతాయా అనేది వేచి చూడాల్సిన విషయం. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితిలో, ఢిల్లీలో మరో సారి అప్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి

 ఢిల్లీ ప్రజలు ఎవరికీ పట్టం కడతారో మరో 11 రోజుల్లో తెలిసిపోతుంది