అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆదాయపు పన్నును రద్దు చేయాల ని భావిస్తున్నట్లు తెలుస్తోంది, అమెరికా “మనల్ని ధనవంతులుగా చేసిన వ్యవస్థ”కి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా వ్యవస్థలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచి తద్వారా అర్ధిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, ఆదాయ పన్ను అధిక మొత్తంలో ఆదాయం లభించినా, ఆదాయ పన్ను రద్దు చేయడం వలన, ప్రజలు ధనవంతులవుతారు అని ట్రంప్ చెప్పారు. అయితే ఈ ఆదాయాన్ని దిగుమతి సుంకాల ద్వారా రాబట్టాలని ట్రంప్ యోచన
“మనల్ని గతంలో కంటే ధనవంతులుగా మరియు శక్తివంతంగా చేసిన వ్యవస్థకు అమెరికా తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైంది.”
1870-1913 మధ్యలో అమెరికా ప్రజలు ధనవంతులుగా వెలిగారని చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేదని ట్రంప్ చెప్పారు
“విదేశీ దేశాలను సంపన్నం చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు, మన పౌరులను సంపన్నం చేయడానికి మనం విదేశీ దేశాలపై పన్ను విధించాలి.” ఈ పన్నులు వాసులు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవిన్యూ సర్వీస్ ను ప్రారంభించినట్లు ట్రంప్ చెప్పారు
భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలన్నీ అధిక పన్నులు వసూలు చేస్తున్నాయి. మనము కూడా భరత్, బ్రెజిల్, చైనా ల పై అది పన్నులు వసూలు చేద్దాం. అమెరికా ఫస్ట్ అన్న నినాదం తో గెలిచినా ట్రంప్ అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా దూసుకు పోతున్నారు

