బాలకృష్ణ వరల్డ్ రికార్డు ; మొదటి ఇండియన్ హీరోగా

by | Aug 24, 2025 | వార్తలు

లండన్ ప్రధాన కేంద్రం గా ఉన్న వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్, నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ను ప్రతిష్టాత్మక అవార్డు తో సత్కరించనుంది.

50 ఏళ్ళు సినిమా రంగంలో హీరో గా రాణిస్తోన్న నందమూరి బాలకృష్ణ ను (Bala Krishna), వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ (World Book of Records), గోల్డ్ ఎడిషన్ లో చేర్చింది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసత్వంగా సినిమాలలోకి వచ్చినా, తన స్వశక్తితో 50 ఏళ్ళ పాటు తెలుగు సినిమా రంగంలో హీరో గా రాణించి, రాణిస్తోన్న నందమూరి బాల కృష్ణ (Nandamuri Bala Krishna) కేవలం సినిమా రంగంలోనే కాదు,  బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు.  అంతే కాకుండా, హిందూపురం ఏం ఎల్ ఎ వరసగా మూడుసార్లు గెలవడమే కాకుండా హిందూపురం అభివృద్ధి పధంలో నడిపిస్తున్నాడు.

వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ (World Book of Records) లో స్థానం సంపాదించిన మొదటి భారతీయ హీరో మన నందమూరి బాలకృష్ణ.  ఆగష్టు 30 న, హైదరాబాద్ లో బాలకృష్ణ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ సంస్థ ఈ అవార్డు తో సత్కరించనుంది.