యుద్ధం మొదలైంది.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ టీజర్

by | Mar 14, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ని అందించారు. హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సముద్రపు ఒడ్డున ఉన్న పడవపై హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూర్చొని ఉండగా.. హీరో వేసుకున్న తెల్లటి చొక్కా రక్తపు మరకలతో నిండిపోయి ఉంటుంది. ఈ ఒక్క విజువల్ ద్వారా మూవీ హై లెవెల్ యాక్షన్ థ్రిల్లర్ లా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ప్రీ టీజర్‌లోనే అఫీషియల్‌ టీజర్‌ విడుదల తేదీని కూడా రివీల్‌ చేశారు మేకర్స్‌. ఈ మూవీ టీజర్ మార్చి 17న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. గతంలో విజయశాంతి (Vijaya Shanti) పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అబిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.