‘SYG’ మెగా మేనల్లుడి హోలీ సర్ ప్రైజ్!

by | Mar 14, 2025 | సినిమా

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu) పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హోలీ పండుగా సందర్భంగా స్పెషల్ అప్డేట్ పోస్టర్ ఇచ్చారు మేకర్స్. ఇందులో చిత్ర బృందం ముఖానికి రంగులతో చేతులు పైకెత్తి సింహ నాదం చేస్తున్నట్లుగా ఉంది.

కాగా, మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథ 1947కి ముందు నాటి సామాజిక పరిస్థితులలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీలో సాయిదుర్గతేజ్‌ (Sai Durga Tej) పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ సంజయ్‌దత్‌ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే జగపతిబాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తుండగా.. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.