ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ పాత్రలో నటించిన సీక్వెల్ మూవీ పుష్ప 2 ది రూల్. సీనియర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) , అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం బన్నీ అభిమానులతో పాటుగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) త్రివిక్రమ్‌తో (Trivikram) సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, నాగవంశీ నిర్మించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ప్రొడ్యూసర్ నాగవంశి అందించారు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో బన్నీ, త్రివిక్రమ్ మూవీ గురించి నాగవంశీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో సినిమా కోసం త్రివిక్రమ్ సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇప్పటివరకు చూడని సరికొత్త పాత్రలో బన్నీని చూడబోతున్నాం. బన్నీ-త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఇంకా మొదలవలేదు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభమవనుంది అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. దింతో అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాకు మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సిఉంది. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

