అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్న అల్లు అరవింద్

by | Feb 12, 2025 | సినిమా

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.  ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ పూర్తిగా అనిల్ రావిపూడికే దక్కుతుంది.  ఎందుకంటె, తీవ్ర పోటీ మధ్య విడుదలయిన ఈ సినిమా ప్రొమోషన్స్ ని ముందుండి నడిపించాడు. ఎక్కడ చూసిన సంక్రాంతికి వస్తున్నాం టీం కనపడింది ఈ మధ్య.  ఈ మాట మెగా స్టార్ చిరంజీవి చెప్పారు.  విడుదలకు ముంది అనిల్ రావిపూడి వినూత్నంగా ప్రమోట్ చేశారు.  ఈ ప్రొమోషన్ వీడియోలలో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.  విడుదలైన తర్వాత వారం, పది రోజులకొక చోట సక్సెస్ మీట్ పెట్టారు.  ఆ విధం గా తీవ్ర పోటీలోనూ సంరకాంతికి వస్తున్నాం సినిమాను సూపర్ హిట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి

ఇప్పుడు, ఇదే తరహా స్ట్రాటజీ ని ఫాలో అవ్వబోతున్నారు తండేల్ నిర్మాతలు, దర్శకులు.  నిన్ననే, కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా తండేల్ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఇప్పుడు మరో సక్సెస్ ఈవెంట్ ను, మరో చోట ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం , సాయి పల్లవి నటన తండేల్ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి అనడంలో సందేహం లేదు.  నాగ చైతన్య కూడా బాగానే నటించాడు.

అయితే తండేల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం తరహాలో 300 కోట్ల వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి