ఊర మాస్ ‘అఖిల్ 6’ టైటిల్ గ్లింప్స్‌కి టైం ఫిక్స్

by | Apr 8, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌‌ గతంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్‌ తదుపరి సినిమా మీదే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ కిరణ్‌ మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ‘అఖిల్ 6’ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ అందించారు చిత్ర బృందం. ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్‌ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ నెక్స్ట్ మూవీ ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ టైం వచ్చేసింది.

అఖిల్ అక్కినేని బర్త్‌ డే సందర్భంగా ఏప్రిల్ 8న సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను, గ్లింప్స్‌ వీడియోను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది అనౌన్స్ చేసిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూస్తుంటే అఖిల్ ఈ సారి ఏదో కొత్త పాయింట్‌తో సినిమా చేస్తున్నాడని తాజా వీడియో చెప్పకనే చెబుతోంది. దింతో అక్కినేని అభిమానులు అఖిల్ కెరీర్ లో సాలిడ్ హిట్ పడడం పక్కా అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం.