మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం ఈ నెల 21 న విడుదలవుతోంది. 1990 లో విడుదలైన కొదమ సింహం సినిమాను 4 కె లో రీ-మాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. రమా ఫిలిమ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కె మురళీమోహన రావు ఈ చిత్రానికి దర్శకుడు. రాజ్-కోటి ద్వయం ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.
ఈ చిత్రంలో ఒక సన్నివేశానికి ఇన్సెప్షన్ సినిమాకు ఉన్న లింక్ గురించి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ‘స్టార్ స్టార్.. మెగాస్టార్’ అనే పాటలో చిరంజీవి నేల మీద నుంచి గోడ పైకి ఆ తరవాత రూఫ్ మీద నుంచి మళ్ళీ నేల మీద కు వస్తారు. 360 డిగ్రీలు నడిచి తిరిగి నేల మీదకు రావడం అన్నమాట. ఈ సన్నివేశం ఇన్సెప్షన్ సినిమాలో కూడా ఉంది. అప్పట్లోనే ఈ సన్నివేశాన్ని ఒక షాట్ లోనే తీశారు. పెద్ద వీల్ మీద సెట్ వేసి ఆ వీల్ తిరుగుతుంటుంది. దానికి కెమెరా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా ఈ కొదమ సింహం సినిమా రామ్ చరణ్ కు బాగా ఇస్తామని చెప్పారు.
ఇంకా ప్రభు దేవా కొరియోగ్రఫీ గురించి, మోహన్ బాబు నటన గురించి, రాజ్ కోటి ల సంగీతం గురించి మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు.

