బాల కృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం అఖండ-2. ఈ సినిమా గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్.
సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుండి జాజికాయ…జాజికాయ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
నందమూరి తేజస్విని సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి అచంట లు నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ తో బాలయ్య (Balayya) నటించిన ఈ హుషారైన సాంగ్ మీరు వినేయండి.

