ఆపరేషన్ కగర్ ప్రభావమా – విజయవాడ లోమావోయిస్టులు

by | Nov 18, 2025 | వార్తలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగర్ ప్రభావమో ఏమో గాని మావోయిస్టులు జనావాసాల మధ్యకు వస్తున్నారు.  ఈ రోజు విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 28 మావోయిస్టులను పోలీస్ లు అరెస్ట్ చేశారు.

ఈ ఆపరేషన్ కగర్ వలన మావోయిస్టులు వాళ్ళ మకాం ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, ఏలూరు ప్రాంతాలకు మార్చారా, జనావాసాల మధ్య ఎందుకు సమావేశమయ్యారు.  లేదా ఏదైనా పధకం ప్రకారమే అక్కడ సమావేశమయ్యారు అనే విషయాలు పోలీస్ ఎంక్వయిరీ లో తెలియాలి. 27 మావోయిస్టులు అరెస్ట్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత Hidma మరణించారు.  గెరిల్లా దాడుల వ్యూహ రచనలో సిద్ధహస్తుడు అయిన Hidma గతంలో ఎంతో మంది ఆఫీసర్స్ ను చంపేశాడు.

మావోస్టుల బలం తగ్గిపోతూ వస్తోంది.  ఒకప్పుడు 32 మంది ఉండే కేంద్ర కమిటీ లో ప్రస్తుతము 8 మంది మాత్రమే ఉన్నారు.  కొంతమంది చనిపోయారు.  కేంద్ర కమిట సభ్యులలో కొంత మంది లొంగిపోవడం వలన మావోయిస్టు పార్టీ బలహీన పడిపోయింది

కేంద్ర ప్రభుత్వం మార్చ్ 2026 కి మావోయిస్టులు లేని దేశంగా చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.  చత్తీస్ ఘఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో కేంద్ర బలగాలు చేపట్టిన మావోయిస్టుల ఏరివేత లో భాగంగా చేసిన దాడులలో ఇప్పటికే సుమారు 500 మంది మావోస్టులు మరణించారు.  సుమారు 1500 మంది లొంగిపోయారు.