గింగిరాలు తిరిగిన ఈడెన్ పిచ్ : 1st test లో సౌత్ ఆఫ్రికా విజయం

by | Nov 16, 2025 | వార్తలు

గింగిరాలు తిరిగిన ఈడెన్ పిచ్ : మొదటి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం

India Vs South Africa 1st Test Match : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో భారత జట్టు పై ఘన విజయం సాధించింది.  15 సంవత్సరాల తరవాత స్వదేశంలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది

ఈ రోజు ఉదయం సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో 153 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా బాధ్యతాయుతంగా ఆడి 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  చివరలో బాష్ 25 పరుగులు చేసి బావుమా కు చక్కని సహకారం అందించాడు.   ఈ టెస్ట్ మ్యాచ్ లో నమోదైన ఏకైక హాఫ్ సెంచరీ బావుమా చేసినదే.

భారత జట్టు బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ లు రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో ఒక వికెట్ తీశారు.

అనంతరం 124 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 93 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  ఈ ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ కు రాలేదు.

భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో సుందర్ 31 పరుగులు, అక్షర్ పటేల్ 26 పరుగులు చేశారు.  సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో స్పిన్నర్ హార్మర్ రెండవ ఇన్నింగ్స్ లో కూడా 4 వికెట్లు తీసుకున్నాడు. జాన్సెన్, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, మార్కరం ఒక వికెట్ తీశాడు

మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, మొత్తంగా 8 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇన్నింగ్స్ స్కోర్లు

భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ : 189

భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ : 93

సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్  : 159

సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ : 153

బుమ్రా మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ ఈ మ్యాచ్ లో 8 వికెట్లు, మ్యాచ్ లో నమోదైన ఏకైక హాఫ్ సెంచరీ, బావుమా 55 పరుగులు