‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు అరెస్ట్ ; దీని వెనుక ఎవరు ఉన్నారు?

by | Nov 15, 2025 | Uncategorized

‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీస్ లు అరెస్ట్ చేశారు.  ‘ఐ బొమ్మ’ లో ఐ అంటే ఇమ్మడి అని అర్ధం.  ఐ బొమ్మ వెబ్ సైట్ నిండా పైరసీ సినిమాలు, ఓటిటి మూవీస్ ఉంటాయి.  చాలా మంది కొత్త సినిమాలను ‘ఐ బొమ్మలో’ చూడడం అలవాటు చేసుకున్నారు

నిర్మాతల మండలి ఫిర్యాదు తో పోలీస్ లు ఈ ఐ బొమ్మ నిర్వాహకుల పై దృష్టి సారించారు.  ఒకానొక దశలో మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని  ఐ బొమ్మ నిర్వాహకులు సవాల్ విసిరారు.  అయితే పోలీస్ లు చాకచక్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నారు.

ఐ బొమ్మ టీం ఇండియా నుండి వాళ్ళ కార్యకలాపాలు సాగించట్లేదు.   ఈ సినిమాల నిర్వహణకు పెద్ద పెద్ద సర్వర్లు కావాలి.  ఈ సర్వర్ల నిర్వహణకు డబ్బు ఎక్కడనుండి వస్తోంది.  ఐ బొమ్మ నిర్వాహకులకు, కొంత సినిమాల మాస్టర్ ప్రింట్ కాపీ లు ఎక్కడనుండి వెళుతున్నాయి. ఎవరు ఇస్తున్నారు అనేది తేలాలి.  ఐ బొమ్మ వలన సినిమా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోందని నిర్మాతలు చెపుతున్నారు.

చాలా మంది సినిమా అభిమానులు థియేటర్ కి వెళ్లకుండా ఈ ఐ బొమ్మ సైట్ లో కొత్త సినిమాలు చూసేస్తున్నారు.  ఓ టి టి ల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు అనే కన్నా ఇలాంటి పైరసీ భూతాలు సినీ పరిశ్రమను దెబ్బ కొడుతున్నాయని చెప్పాలి.

పోలిసుల విచారణలో ఇంకెలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.  ఇది మన హైదరాబాద్ పోలీస్ లు సాధించిన విజయం గా చెప్పవచ్చు