కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ‘జెట్ లీ’

by | Nov 14, 2025 | సినిమా

కమెడియన్ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మత్తువదలరా 1, మత్తు వదలరా 2 – ఈ రెండు చిత్రాలు సత్య ని స్టార్ కమెడియన్ ని చేశాయి.  ఈ రెండు చిత్రాలకు దర్శకుడు రితేష్ రానా.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ‘జెట్ లీ.  ఈ సినిమా టైటిల్ కు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు.   పోస్టర్ చూస్తేనే ఈ సారి సత్య మరింత హై రేంజ్ లో మనల్ని నవ్విస్తాడనిపిస్తోంది.

క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.  కాల భైరవ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తున్నాడు.

ఈ పోస్టర్ మీద ‘ఐ యామ్ డన్ విత్ కామెడీ’ అని కాప్షన్ ఉంది. అంతే కాకుండా ఈ పోస్టర్ లో సత్య విమానం పైన కూర్చుని ఉన్న స్టిల్ ఉంది. ఈ పోస్టర్ తో అంచనాలను భారీగా పెంచేశాడు దర్శకుడు రితేష్ రానా. 

హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పోస్టర్ మీద రాసుంది.  పిల్లలను కూడా టార్గెట్ చేసుకుని ఈ సినిమా తీయబోతున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతోందో.  ఈ సినిమా సత్య శైలి  కామెడీ యాక్షన్ గా ఉండవచ్చు.  అతి త్వరలో ఈ సినిమా షూట్ ప్రారంభమవుతుంది