భారత, దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు ప్రారంభమైన మొదటి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ జాన్సెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రాహుల్ 13 పరుగులతో, సుందర్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
వాషింగ్టన్ సుందర్ మూడవ స్థానానికి ప్రమోట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. నాలుగవ స్థానంలోనే సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కు వచ్చేవాడు
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణ ఆఫ్రికా బుమ్రా ధాటికి 159 పరుగులకే కుప్ప కూలింది. 31 పరుగులు చేసిన ఓపెనర్ మార్క్రమ్ ఆ జట్టులో టాప్ స్కోరర్. కెప్టెన్ బావుమా 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
భారత బౌలర్లలో స్టార్ పేసర్ బుమ్రా 5 వికెట్లు తీసుకోగా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.


