కే సి ఆర్ మౌనానికి అర్ధం; ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా

by | Nov 9, 2025 | రాజకీయాలు

కే సి ఆర్ రాజకీయాలనుండి రిటైర్మెంట్ తీసుకున్నారా ; ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడింది.  అధికార పార్టీ కాంగ్రెస్, బి ఆర్ ఎస్, భాజపా లు సర్వ శక్తులు వడ్డీ ప్రచారం చేశాయి.  పేరుకే మూడు పార్టీ లు హోరెత్తిస్తున్న ఇక్కడ పోటీ అధికార కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీ ల మధ్యే ఉంది.  భాజపాకు ఏం ఎల్ ఏ ఎన్నికల్లో అంత వోట్ షేర్ లేదు

2009 లో కాంగ్రెస్ తరపున పి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు.  అయితే ఆ తరవాత మూడు పర్యాయాలు అంటే 2014, 2018, 2023 లో వరసగా మూడు పర్యాయాలు మాగంటి గోపినాధ్ గెలిచారు.  ఒకసారి తెలుగు దేశం పార్టీ తరపున గెలిస్తే, రెండు సార్లు బి ఆర్ ఎస్ తరపున గెలిచారు. 

మూడు సార్లు గెలిచిన, మాగంటి గోపినాధ్ జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి బి ఆర్ ఎస్ ని గెలిపిస్తుంది.  అప్పుడు సింపతీ తో పని లేదు.

బి ఆర్ ఎస్ పార్టీ ఈ సారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గానే తీసుకున్నట్లు ఉంది.  అయితే ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కెసిఆర్ ఎందుకు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. కనీసం ఉప ఎన్నికకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్ట లేదు. బహుశా సింపతీ పని చేస్తుందనుకుని ఊరుకున్నారా.

అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం గా ప్రచారం చేస్తే, బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టింది.   మాగంటి గోపినాధ్ ని గెలిపించినట్లు తనను కూడా గెలిపించాలని ఆయన భార్య మాగంటి సునీత కోరుతున్నారు

అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ గా ముద్ర వేసిన బి ఆర్ ఎస్ కు హుటా హుటిన అజహారుద్దీన్ ను తీసుకు వచ్చి మైనారిటీ సఖ మంత్రిని చేశారు.  అంతే కాకుండా జూబ్లీ హిల్స్ లో ఫిలిం వర్కర్స్, యూనియన్ లు కూడా ఉంటాయి.  వాళ్లకు లబ్ది చేకూరేలా, పెంచిన సినిమా టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20% సినీ కార్మికులకు ఇచ్చేలా జి ఓ తీసుకు వచ్చారు

అంతే కాకుండా, మాగంటి గోపినాథ్ చనిపోయి ఐదు నెలలు అయిన తరవాత మాగంటి గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది.  ఇప్పటిదాకా మౌనంగా ఉన్న ఆవిడ కు, సరిగ్గా ఉప ఎన్నిక ముందే ఎందుకు అనుమానం వచ్చింది, ఎందుకు పోలీస్  కంప్లైంట్ ఇచ్చింది.  మాగంటి గోపినాథ్ తల్లి కూడా రాజకీయాలు చేస్తున్నారా?  మరో పక్క ఈ విషయం పై బండి సంజయ్ మాటలు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి

ఏం ఎల్ ఏ గా మాగంటి సునీత గెలిచినా అధికార పార్టీ సహకారం లేకుండా ఏ చేయగలరు.  ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది.  

అంతే కాకుండా ఉప ఎన్నికకు సంబంధించి కెసిఆర్ మౌనంగా ఉండడం పై కూడా అనేక సందేహాలున్నాయి.  బి ఆర్ ఎస్ గెలిచిన రెండు పర్యాయాలు కే సి ఆర్ ని చూసే ఓట్లు వేసిన జనం, ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంటే కే సి ఆర్ మౌనాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎలా తీసుకుంటారు

ఈ ఉప ఎన్నిక గెలిచినా, ఓడిన బి ఆర్ ఎస్ కు ఏమి ఉపయోగం ఉండదు. అధికార కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం బి ఆర్ ఎస్ సీట్ ను హస్తగతం చేసుకున్నట్లు అవుతుంది.

కే టి ఆర్, హరీష్ రావు లు పైకి  మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నా బి ఆర్ ఎస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. 

కవిత లిక్కర్ స్కాములో అరెస్ట్ అవడం, బి ఆర్ ఎస్ పార్టీ లో ఉంటూ హరీష్ రావు కు వ్యతిరేకంగా మాట్లాడిన కవిత ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం, కవిత సస్పెండ్ పై అన్న కే టి ఆర్ మాటలాడక పోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవక తవకలు, గెలిచినా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కి వెళ్ళకపోవడం

ఈ మూడు సంవత్సరాలు ప్రజా క్షేత్రంలో ఉంది, మూడు సంవత్సరాల తరవాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అప్పుడు బి ఆర్ ఎస్ పరితిత్తి ఏంటి?  71 సంవత్సరాల వయసున్న కే సి ఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 74 ఏళ్ళు వస్తాయి.  అప్పటికి అంత యాక్టివ్ గా కే సి ఆర్ రాజకీయాల్లో ఉండగలరా?  తెలంగాణ సాధించిన నాయకుడిగా కెసిఆర్ చరిత్రలో నిలబడాలంటే మౌనంగానే ఉండాలా? ఇక రాజకీయాలకు కెసిఆర్ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా.  ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.