మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా నుండి విడుదలైన మొదటి సింగల్ ‘చికిరి చికిరి’ సాంగ్ దేశాన్ని ఒక ఊపు ఊపుతోంది.
ఇప్పటికే, ఇండియన్ సినిమా చరిత్రలోనే పాట విడుదలైన ఒక్క రోజులో అంటే 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే, ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సినిమా గా రికార్డు సృష్టించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ సాధించిన రికార్డు ను మన పెద్ది చికిరి చికిరి సాంగ్ తో 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ తో అధిగమించాడు.
అతి వేగంగా 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన పాటగా రికార్డు సృష్టించింది. కేవలం పాట విడుదలైన 35 గంటల్లోనే ఈ 50 మిలియన్ వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ పాట 53 మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా 1.1 మిలియన్ లైక్స్ ని కూడా సాధించింది. ఈ మేరకు పెద్ది టీం పోస్టర్ రిలీజ్ చేసింది
బాలాజీ రాసిన ఈ పాటను మోహిత్ చౌహన్ ఆలపించారు. జాహ్నవి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్. మార్చ్ 27, 2026 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కి రామ్ చరణ్ డాన్స్ …వీరిద్దరికి ఏ ఆర్ రెహ్మాన్, బుచ్చిబాబు తోడైతే మరి పాన్ ఇండియా రికార్డు లు కాక ఇంకేం వస్తాయి.

