ఇండియా, ఆసీస్ టీ 20 సిరీస్ : రికార్డు పై కన్నేసిన బుమ్రా

by | Nov 8, 2025 | వార్తలు

India Vs Australia T20 series : ఆస్ట్రేలియా లో భారత,ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు 5 వ టి 20 మ్యాచ్ బ్రిస్బేన్ లో జరగనుంది. ఇప్పటికే భారత జట్టు సిరీస్ లో  2-1 తో ముందంజ లో ఉంది.  ఐదవ మ్యాచ్ గెలిచి 3-1 తో సిరీస్ గెలుచుకోవాలన్న పట్టుదలతో సూర్యకుమార్ సేన ఉంది.  అయితే ఈ మ్యాచ్ గెలిచి సొంత గడ్డపై కనీసం సిరీస్ ఊడిపోకుండా, సమం చేయాలనీ ఆస్ట్రేలియా ఉంది.

ఈ రోజు మ్యాచ్ లో బుమ్రా (Bumrah) ఒక వికెట్ తీసుకుంటే టి 20 మ్యాచ్ లో 100 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. అంతే కాదు మూడు  ఫార్మాట్లలో (వన్ డే, టి 20, టెస్ట్ మ్యాచ్ లలో) 100 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో 5 వ స్థానంలో నిలుస్తాడు. భారత్ జట్టు తరపున మొదటి బౌలర్ గా నిలుస్తాడు.  ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన వారి జాబితాలో లసిత్ మలింగా, సకిబ్ ఉల్ హాసన్, టిమ్ సౌథీ, షాహిన్ ఆఫ్రిది లు ఉన్నారు

అయితే భారత జట్టు తరపున టీ 20 లో 105 వికెట్లతో అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Sing) అగ్రస్థానంలో ఉన్నాడు. టి 20 ఫార్మట్ లో 100 వికెట్లు తీసుకున్న రెండవ భారత బౌలర్ గా బుమ్రా నిలువనున్నాడు.  భారత యువ బ్యాటర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ (Abhishek Sharma) కూడా అంతర్జాతీయ టి 20 మ్యాచ్ లలో 1000 పరుగులు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు