నాగార్జున కు, జీ తెలుగు బర్త్ డే షాక్

by | Aug 29, 2025 | టీవీ & ఓటిటి

జీ తెలుగు (Zee Telugu) సరికొత్త నాన్ ఫిక్షన్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammura)  ఈ ఆగస్టు నెల 17 నుండి ప్రారంభమయ్యింది.

ఈ షో గతంలోనే  జీ తెలుగు లో వచ్చిన కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో కి దగ్గరగా ఉంటుంది. అప్పట్లో ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేశాడు.  ఇప్పుడు ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో కి జగపతి బాబు (Jagapathi Babu) యాంకరింగ్ చేస్తున్నాడు.

ఆగష్టు 14 న నాగార్జున నటించిన కూలీ (Coolie)  సినిమా విడుదలైన సందర్భంలో, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మొదటి ఎపిసోడ్ కి  అతిధిగా కింగ్ నాగార్జున (Nagarjuna) వచ్చాడు.  ఈ ఎపిసోడ్ ను జీ 5 లో మూడు రోజుల ముందు అంటే ఆగష్టు 15 న స్ట్రీమింగ్ చేశారు. ఆగష్టు 17 న జీ తెలుగు (Zee Telugu) లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యింది.

‘జయమ్ము నిశ్చయమ్మురా షో రేటింగ్స్ నాగార్జున (Nagarjuna)  పుట్టిన రోజు అయిన ఆగష్టు 29 న, అంటే ఈ రోజు వచ్చాయి.  నాగార్జున ఎపిసోడ్ కి 2 రేటింగ్ పాయింట్లు  మాత్రమే వచ్చాయి.  అతి దారుణమైన రేటింగ్ అని చెప్పవచ్చు. 

అయితే నాగార్జున ఎపిసోడ్ కి ఇలాంటి రేటింగ్ రావడానికి కారణాలు లేకపోలేవు.  నాగార్జున (Nagarjuna) గురించి కొత్తగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినవి ఏమి లేవు.  ఈ షో ఫార్మటు కూడా అతి పురాతనమైనది.  అంతే కాకుండా ఈ షో ని మూడు రోజుల ముందే జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ చేశారు.  వీటన్నింటి వలన నాగార్జున ఎపిసోడ్ కి కేవలం 2 రేటింగ్ పాయింట్లు మాత్రమే వచ్చాయి.

రెండవ ఎపిసోడ్ లో శ్రీ లీల (Sree Leela)  వచ్చింది.  ఆ ఎపిసోడ్ ఎన్ని రేటింగ్ పాయింట్లు వస్తాయో చూడాలి.   ఒక రకంగా జీ తెలుగు (Zee Telugu) కు ఈ రేటింగ్ పెద్ద షాక్ అని చెప్పవచ్చు.