గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’.
రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్ గా, ప్రస్తుతం 1000 మంది డాన్సర్లతో ఒక పాట చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించనున్నారు
వృద్ధి సినిమాస్ పతాకంపై, వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు
పెద్ది (Peddi) సినిమా Glimpse విడుదలైన తర్వాత ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. జాహ్నవి కపూర్ (Jahnavi Kapoor) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పెద్ది (Peddi) చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు
పెద్ది సినిమా 2026 మార్చ్ 27 న, రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు నాడు విడుదలవుతోంది.
పెద్ది (Peddi) టీం ఈ సాంగ్ షూట్ నుండి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ చేశారు.
దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) ఎక్స్ లో ‘రహమాన్ గారి డప్పు….రామ్ చరణ్ గారి స్టెప్పు….’ అని పోస్ట్ చేశారు. అభిమానులకు ఈ పోస్ట్, వినాయక చవితి పండగ స్పెషల్ గిఫ్ట్ అని చెప్పవచ్చు.
Buchibabu Post

