స్టార్స్ ఎవరు కూలీ ని కాపాడలేకపోయారా ; కారణాలు ఏంటి

by | Aug 27, 2025 | సినిమా

సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కూలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా నిలిచింది.

రజనీకాంత్ (Rajanikanth) హీరోగా నడిచిన ఈ కూలీ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్.  ఇంకా ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna), అమిర్ ఖాన్ (Amir Khan) , ఉపేంద్ర (Upendra) , శృతి హాసన్ (Shruthi Hasan) లు నటించారు.

భారీ అంచనాల మధ్య, 1000 కోట్ల లక్ష్యంతో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన కూలీ,(Coolie) అంచనాలు అందుకోలేక చతికిలపడింది.

కూలీ సినిమా 13 రోజులకు సుమారు 264 కోట్లు వసూలు చేసింది.  13 వ రోజు కూలీ తమిళ్ లో 1.9 కోట్ల వసూళ్లు సాధించగా, హిందీ లో 1.1 కోట్లు, తెలుగు లో 65 లక్షల వసూళ్లు సాధించింది.

కూలీ సినిమాకి ఈ మాత్రం వసూళ్లు రావడానికి కారణాలు ఏంటో చూద్దాం

  • నాలుగు రోజుల వరస సెలవులు ఉన్నప్పుడు కూలీ సినిమా విడుదల అవడం. 
  • కూలీ విడుదలైన రోజు వచ్చిన వార్ 2 సినిమా టాక్ నెగటివ్ గా ఉండడం
  • కూలీ సినిమాలో రజనీకాంత్ (Rajanikanth( తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమిర్ ఖాన్, శృతి హాసన్ వంటి అగ్ర నటినటులు నటించడం
  • దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) చిత్రాల ట్రాక్ రికార్డు

ఇక కూలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడానికి కారణాలు ఏంటో చూద్దాం

  • సరైన కధ లేకపోవడం
  • 74 ఏళ్ళ వయసులో రజనీకాంత్ చేయకూడని రోల్ కావడం
  • అమిర్ ఖాన్, ఉపేంద్ర లు పేరుకే గాని, సరైన పాత్రలు లోకేష్ కనకరాజ్ రాయలేకపోవడం
  • నాగార్జున క్యారెక్టర్ అంత గొప్పగా రాకపోవడం
  • పార్ట్-2 కోసం, కూలీ సినిమాని అసంపూర్ణంగా ముగించడం
  • సినిమా రెండు భాగాలలో ఏదో భాగాన్ని చేతులెత్తేసి గాలికి వదిలేసే లోకేష్ కనక రాజ్ బలహీనత
  • ఇంత మంది అగ్రహీరోలందరూ, సైడ్ క్యారెక్టర్ లు మిగిలిపోయి, శోబిన్ షాహిర్, రచితా రామ్ లు హైలైట్ కావడం
  • సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ రావడం
  • స్వతహాగా లోకేష్ కనక రాజ్ సినిమాలకు ఫ్యామిలి ఆడియన్స్ అంత తొందరగా  ముందుకు రాకపోవడం అనే బలహీనత

కూలీ చిత్రానికి ఏ రావడాన్ని గొప్పగా ప్రకటించుకున్న సన్ పిక్చర్స్ (Sun Pictures), సినిమా విడుదలైన నాలుగు రోజుల తరవాత వసూళ్లు పడిపోయిన తరవాత సుప్రీమ్ కోర్ట్ వెళ్ళింది.  అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కూలీ పరాజయం సన్ పిక్చర్స్ కే కాదు, లోకేష్ కనకరాజ్ కు కూడా పెద్ద దెబ్బే. సినిమా  ప్లాప్ అయ్యాక ఇప్పుడు అందరు రజనీకాంత్ కధ మార్చాడని అంటున్నారు. నిజం ఏంటో రజనీకాంత్ కు, లోకేష్ కనకరాజ్ లకు మాత్రమే తెలియాలి

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వారు 120 కోట్లు పెట్టి ఈ సినిమా కొన్నారు. ఏ సర్టిఫికెట్ ఉన్న ఈ సినిమాని ఓ టి టి లో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.  ఈ సినిమా జెమినీ టీవీ (Gemini TV) లో దీపావళి ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయి.  టెలివిజన్ లో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.  చాలామంది రజనీకాంత్ అభిమానులు మాత్రం కూలీ చిత్రం కన్నా జైలర్ (Jailer) సినిమా బావుందని అన్నట్లుగా తెలుస్తోంది           

రజనీకాంత్ (Rajanikanth) తో సహా ఇంత మంది స్టార్లు ఉన్నా, కూలీ సినిమాని ఎవరు కాపాడలేకపోయారు.  నాలుగు రోజుల వరస సెలవులు కలిసిరాబట్టి ఈమాత్రం వసూళ్లు వచ్చాయి.  లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది కూలీ పరిస్థితి.  సినిమాకి కావలసింది స్టార్లు కాదు, కధ అని మరో సారి కూలీ సినిమా ప్రూవ్ చేసింది.

కూలీ సినిమా ఖచ్చితంగా రజనీకాంత్ కు, లోకేష్ కనకరాజ్ కు ఒక  గుణపాఠం అని చెప్పవచ్చు