తేజ సజ్జా సూపర్ యోధగా వస్తోన్న ‘మిరాయ్’ మేకింగ్ వీడియో

by | Aug 23, 2025 | సినిమా

హనుమాన్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా తదుపరి చిత్రం ‘మిరాయ్’.  ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం లో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్  ‘మిరాయ్’ మేకింగ్ వీడియో ను విడుదల చేశారు. 

ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధా గా కనిపించనున్నాడు.  పీపుల్ మీడియా ఫాక్టరి వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.