పవన్ కల్యాణ్ ‘హరి హర వీర మల్లు’ ఓ టి టి స్ట్రీమింగ్ డేట్ ఖరారు

by | Aug 19, 2025 | టీవీ & ఓటిటి

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన సినిమా హరి హర వీర మల్లు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదలైన మొదటి పవన్ కల్యాణ్ సినిమా.

ఈ సినిమాకు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగాడు.  ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లకు హాజరయ్యి సినిమాని ప్రమోట్ చేశాడు.

హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  మొదటి వారంలో కలెక్షన్స్ బాగానే వచ్చిన తరవాత వారంలో కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి.  పవన్ కల్యాణ్ నటన బాగానే ఉన్నా, నాసిరకం గ్రాఫిక్స్,  అస్తవ్యస్తంగా ఉన్న కధ ఈ తరం ప్రేక్షకులకు రుచించలేదు.

అయితే ఇప్పుడు హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu)  సినిమా, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో  అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఈ ఆగస్టు 20 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఈ విషయాన్నీ హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) టీం అధికారికంగా ప్రకటించింది