సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరగబోయే ఆసియా కప్ కు, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, భారత జట్టును ప్రకటించింది. ఆసియా కప్ టి 20 ఫార్మట్ లో నిర్వహిస్తారు
ప్రస్తుత టి 20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వైపే సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను ప్రకటించింది. ప్రస్తుత భారత జట్టు టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు ఇదే
- సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్) (Surya Kumar Yadav)
- శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్) (Subhman Gill)
- అభిషేక్ శర్మ (Abhishek Sharma)
- తిలక్ వర్మ (Tilak Varma)
- జితేష్ శర్మ (వికెట్ కీపర్)
- హార్దిక్ పాండ్య (Hardhik Pandya)
- అక్షర్ పటేల్ (Akshar Patel)
- శివమ్ దూబే (Shivam Dube)
- జస్ప్రీత్ బుమ్రా (Bumrah)
- అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh)
- వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)
- కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)
- హర్షిత్ రానా (Harshit Rana)
- సంజు శాంసన్ (వికెట్ కీపర్)
- రింకు సింగ్
యూ ఏ ఈ లో జరగబోయే ఈ ఆసియా కప్ లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ లో యూ ఏ ఈ తో సెప్టెంబర్ 10 న తలపడనుంది. సెప్టెంబర్ 14 న భారత, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 19 న ఒమాన్ తో ఆఖరి లీగ్ మ్యాచ్.
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు లో శ్రేయాస్ అయ్యర్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. మంచి ఫామ్ లో శ్రేయాస్ అయ్యర్ ను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియలేదు.


