మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం టైటిల్ ను ఈ ఆగష్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేయనున్నారు.
సాహు గారపాటి(Sahu Garapati), కొణిదెల సుష్మిత (Konidela Sushmitha) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ (Bheems) సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార (Nayanathara) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) జడ్జి గా వ్యవహరిస్తోన్న ఒక టీవీ షో లో ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి రావిపూడి లీక్స్ ఇచ్చారు.
ఈ సినిమా టైటిల్ కోసం అనిల్ రావిపూడి మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ఏమిటో చూడం
- ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం
- బాస్ తో ఈ పండగా రఫ్ఫాడిస్తున్నాం
- మన శివ శంకర వర ప్రసాద్ గారు
ఈ మూడు టైటిల్స్ లో ఎక్కువ మంది ‘మన శివ శంకర వర ప్రసాద్ గారు’ టైటిల్ కు వోట్ వేస్తున్నారు. ఈ మూడు టైటిల్స్ లో ఒకటి కావచ్చు లేదా ఈ మూడు టైటిల్స్ కి దగ్గరగా ఉండచ్చు. ఈ నెల 22న చిరంజీవి (Chiranjeevi) 70 వ పుట్టిన రోజు సందర్భంగా, ఈ ఆగష్టు 21 సాయంత్రం గాని, పుట్టిన రోజు అయిన 22న గాని టైం చూసుకుని టైటిల్ రివీల్ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెప్పారు.
ఇది చిరు (చిరు) లీక్స్ కాదు, రావిపూడి (రావిపూడి) లీక్స్

