రజనీకాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆగష్టు 14 న విడుదలైన కూలీ చిత్రం మొదటి రోజు వసూళ్ళలో రికార్డు సృష్టించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన కూలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సాదించిందినా చిత్రం నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటి దాకా ఈ రికార్డు విజయ్ (Vijay) నటించిన లియో (Leo) చిత్రం పేరిట ఉంది. ఈ చిత్రానికి కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్
రజనీకాంత్ (Rajanikanth( క్రేజ్, లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) ట్రాక్ రికార్డు తో నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra), అమిర్ ఖాన్ (Amir Khan) లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడం వలన ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కంటెంట్ మీద, సోషల్ మీడియా లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా, మొదటి బాక్స్ ఆఫీస్ దుమ్ము దూలపడమే కాకుండా, 74 ఏళ్ళ వయసులు రజనీకాంత్ కొత్త రికార్డు సృష్టించాడు.
వార్ 2 (WAR 2) సినిమా పై నెగటివ్ రివ్యూ లు రావడం వలన, లాంగ్ వీకెండ్ లో ఉన్నంతలో కూలీ (Coolie) చిత్రం పరవాలేదనిపించుకోవడం కూలీ సినిమాకి కలిసొచ్చే అంశం. ఈ వారంతానికి, కూలీ చిత్రం ఎన్నో రికార్డు లు క్రియేట్ చేస్తుంది అని ఆశాభావంతో ఉన్నారు సూపర్ స్టార్ రజని కాంత్ (Rajanikanth) అభిమానులు.


