బిగ్ బాస్ నే మార్చేసిన బిగ్ బాస్ సీజన్ 9

by | Aug 10, 2025 | Uncategorized

బిగ్ బాస్ నే మార్చేసిన బిగ్ బాస్ సీజన్ 9-  ఈ సారి  డబల్ హౌస్, డబల్ డోస్

బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 9 కి రంగం సిద్ధమవుతోంది.  స్టార్ మా వారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి ఆదివారం బిగ్ బాస్ ని లాంచ్ చేస్తారు.  ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 ని, సెప్టెంబర్ మొదటి వారంలో లాంచ్ చేయనున్నారు.  ఈ రోజు వెన్నెల కిశోర్ (Vennela Kishore), నాగార్జున (Nagarjuna) కాంబినేషన్ లో వచ్చిన ప్రోమో, బిగ్ బాస్ (Bigg Boss) అభిమానులను అక్కట్టుకుంటోంది.  ప్రతి సీజన్ కి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకు రావడానికి స్టార్ మా వారు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ సారి, బిగ్ సీజన్ 9 కి వెళ్లాలంటే 9 ప్లానెట్స్ అనుగ్రహం ఉండాలి అనే కాన్సెప్ట్ తో ప్రోమో చేశారు. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 లో బిగ్ బాస్ నే మార్చినట్లుగా ప్రోమో లో చెపుతున్నారు.  అంతే కాదు, డబల్ హౌస్, డబల్ డోస్ అని చెపుతున్నారు. 

ఈ సారి బిగ్ బాస్ లో అందరి సరదాలు తీరిపోతాయి ఈ సారి బిగ్ బాస్ సీజన్, చదరంగం కాదు రణరంగం అంటున్నారు హోస్ట్ నాగార్జున (Nagarjuna)

సెలబ్రిటీస్ తో పాటు, కామన్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసే, ఈ సీజన్ 9 బిగ్ బాస్ (Bigg Boss) ఎలా ఉంటుందో చూడాలంటె సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే.