జిమ్ లో ముగ్గురు మెగా హీరోలు …ఏంటి కథ

by | Aug 10, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ – ఈ ముగ్గురు మెగా హీరో లు ఒకే ఫ్రేమ్ లో అది కూడా జిమ్ లో ఉన్న ఫోటో ను వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. మెగా హీరో ల అభిమానులను ఈ ఫోటో ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తుంటే, వరుణ్ తేజ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నారు. సాయి దుర్గ తేజ్  ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో చేస్తున్నారు.  పెద్ది చిత్రం లో సమంత ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి

ఈ ఒక్క ఫోటో తో మెగా హీరోల నటిస్తున్న సినిమాలు వైరల్ అవుతున్నాయి.  మెగా హీరో లు నటిస్తున్న ఈ మూడు చిత్రాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మెగా ఫాన్స్ ఈ ఫోటోతో సంబరపడిపోతున్నారు.