ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు 50 వ పుట్టిన రోజు జరుపుట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి, ఇప్పటికే ఎక్స్ వేదికగా మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా అభిమానులు మహేష్ బాబు కు విషెస్ చెపుతున్నారు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎక్స్ వేదికగా ఒక అప్డేట్ వదిలారు. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 2025 లో మొదటి రివీల్ ఉంటుందని దర్శక ధీరుడు రాజమౌళి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి #GlobeTrotterఅనే హాష్ టాగ్ ను జత చేశారు
దుర్గ ఆర్ట్స్ పతాకం పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల తో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2027 లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
అయితే మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. అభిమానులు లాగా నేను కూడా నా మొదటి లుక్ ను చూసుకోవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాని చెప్పారు.


