టికెట్ రేట్లు, రెమ్యూనరేషన్ లేనా పెరిగేది, కార్మికుల వేతనాలు?

by | Aug 5, 2025 | వార్తలు

సినీ కార్మికుల వేతనాల పెంపుపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. వేతనాలు పెంచిన వాళ్ళకే పని చేస్తామని సినీ కార్మికులు తెగేసి చెప్పారు.  ఈ విషయం ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కోపం తెప్పించింది.

నిర్మాతలు సి కళ్యాణ్(Kalyan), అల్లు అరవింద్ (Allu Aravind) , సురేష్ బాబు,రవి శంకర్, కె ఎల్ నారాయణ, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు ఈ రోజు చిరంజీవిని కలిసినట్టు సమాచారం. మరో పక్క, ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న,  తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దిల్ రాజు ని ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని చెప్పారని తెలుస్తోంది.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అయినా, చిరంజీవి (Chiranjeevi) అయినా యూనియన్ కార్మికులతో సమావేశమై వారి వాదనను కూడా వినాలని అన్నారు.  లేకపోతే రెండు, మూడు రోజులలో నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పినట్లు నిర్మాత సి కళ్యాణ్ చెప్పాడు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  సినిమాలు తీసే నిర్మాతలకు, సినీ కార్మికుల సంగతి పట్టదా, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న రోజులివి. హీరో, హీరోయిన్, దర్శకుడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.   ప్రభుత్వాలు కూడా భారీగా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులిస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప-2 (Pushpa-2) టికెట్ రేట్లు భారీగా పెంచి రికార్డు వసూళ్లు  సాధించింది.

కార్మికులు ఏమైనా సినిమా టైటిల్స్ లో పేరు వేయమన్నారా, వేతనాలు పెంచామన్నారు. నాలుగు సంవత్సరాల తరవాత 30% పెంచమని అడుగుతున్నారు. మారుతున్న జీవన పరిస్థితులను బట్టి, వాళ్ళ కష్టానికి తగ్గ వేతనాలు ఇవ్వాలి.    సినీ కార్మికులకు నెలకు కనీస వేతనం 50 వేలు ఉండాలి. 

ఇదేమి పరిష్కరించుకోలేని సమస్య కాదు. నిర్మాతలు హీరో అడిగితే ఎంత ఇవ్వడానికి వెనుకాడరు. అంటువంటప్పుడు సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలకు వచ్చిన సమస్య ఏమిటి అనేది అర్ధం కాదు.  ఏ ఇండస్ట్రీ వాళ్ళు అయినా వచ్చి పని చేయచ్చని ఒక వెబ్ సైట్ ఓపెన్ చేశారు టాలీవుడ్ నిర్మాతలు. వాళ్లకు మొత్తం పెద్ద మొత్తంలో ఇవ్వడానికి సిద్ధ పడ్డారట నిర్మాతలు. ఏమైనా అంటే,  ఇప్పుడు టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లకు ఎక్కువ ఇస్తాము అనే నిర్మాతలకు, వేతనాలు పెంచమని అడిగే దాకా, టాలెంట్ గురించి నిర్మాతలకు తెలియదా

ఎక్కడో బయట నుండి వచ్చిన వాళ్లకు రాచ మర్యాదలు చేసిన డబ్బులు ముట్ట చెప్పే బదులు లోకల్ టాలెంట్ కు డబ్బులిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతల మండలికి లేదా. 

కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కూడా అంత జీతాలు ఉండవు అని కొంత మంది అంటున్నారు. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నెలంతా పని ఉంటుంది.  సినీ కార్మికులకు నెల అంత పని ఉంటుందని గారంటీ ఉంటుందా, నిర్మాతల మండలి హామీ ఇస్తుందా 

సినీ కార్మికులు వేతనాలు పెంచామన్నారు కదా అని, తక్కువ వేతనాలు ఇచ్చి బయట నుండి వేరే వారిని పెట్టుకోవడం కూడా దుర్మార్గం.  అంత వరకు వెళ్లకుండా,  నటి నటులు, దర్శకులు చొరవ తీసుకుని, తమ తమ పారితోషికాలు తగ్గించుకుని కార్మికులను ఆదుకోవాలి.  ఈ విషయంలో నిర్మాతలు చొరవ తీసుకోవాలి

ఇక ఇప్పుడు విషయం చిరంజీవి (Chiranjeevi) ఇంటి దాకా వెళ్ళింది అంతే కాకుండా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ విషయం పై దిల్ రాజు ను ఆదేశించారు. దిల్ రాజు, చిరంజీవి కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగుతారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఎందుకంటె దిల్ రాజు కూడా నిర్మాత కదా.  నిర్మాతల మండలి కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేడు.