3rd Test : రెండవ ఇన్నింగ్స్ లో ఎదురీదుతోన్న ఇంగ్లాండ్

by | Jul 13, 2025 | వార్తలు

విజృంభించిన సిరాజ్, సుందర్ ; రెండవ ఇన్నింగ్స్ లో ఎదురీదుతోన్న ఇంగ్లాండ్

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ లో జరుగుతోన్న మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి 6 వికెట్లు నష్టపోయి 175 పరుగులు మాత్రమే చేసింది.

ప్రధాన బ్యాట్స్ మన్ అందరు పెవిలియన్ చేరుకోగా, కెప్టెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 40 పరుగులు చేసిన రూట్ రెండవ ఇన్నింగ్స్ లోనూ  టాప్ స్కోరర్. డకెట్, పొప్ లను అవుట్ చేసి, సిరాజ్  ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు

టీ విరామం ముందు జెమీ స్మిత్, జో రూట్ లను, వాషింగ్టన్ సుందర్  బౌల్డ్ చేసి మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. టీ విరామానికి, జో రూట్ తో పాటు వోక్స్ క్రీజ్ లో ఉన్నాడు. 

భారత జట్టు కు ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.  ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో ముందంజ వేసే అవకాశాన్ని భారత జట్టు ఒడిసి పట్టుకుంటుందో లేదో చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ చెరో ఒక వికెట్ తీశారు