కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సునీల్, ప్రసన్న, యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అజిత్ (Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో విడుదల చేశారు. దింతో ఈ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక వీకెండ్ తో పాటుగా ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ వల్ల మరింత ఎక్కువ కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ మంచి సక్సెస్‌తో దూసుకెళ్లడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పొచ్చు. దీంతో అజిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రాన్ని రూ. 280 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా… ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా బాక్సఫీస్ వద్ద రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

