విధ్వంసం అంటే ఇదే : అప్పుడు జాని బెయిర్ స్టో ; ఇప్పుడు అభిషేక్ శర్మ
విధ్వంసం అంటే ఏంటో తెలుసా. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం విధ్వంస రచన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ
పంజాబ్ కింగ్స్ విసిరిన 246 పరుగులను 18.3 ఓవర్ల లోనే ఛేదించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీల్ లో చరిత్ర సృష్టించింది. ఐపీల్ చరిత్రలోనే రెండవ అతి పెద్ద ఛేదన ఇదే.
హనుమాన్ జయంతి రోజున, హనుమంతుడి ఆశీర్వాదంతో అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడి విధ్వంస రచన చేసిన అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే అభిషేక్ శర్మ కు, ట్రావిస్ హెడ్ అందించిన సహకారం మరువలేనిది
ఐపీల్ చరిత్రలోనే మూడవ వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో 175 పరుగులు చేసిన క్రిస్ గేల్ ఉండాగా, 158 పరుగులు చేసిన మెక్ కలమ్ రెండవ స్థానంలో ఉన్నాడు.
మేము కొడితే రికార్డు లు బద్దలవుతాయి అన్నట్లుగా సాగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు. ఐపీల్ 2025 సీజన్ మొదటి మ్యాచ్ లో 286 పరుగుల భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్, తరవాత వరసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది. మళ్ళీ రికార్డు చేధనతో గెలుపు బాట పట్టింది.
2024 లో, సరిగ్గా సంవత్సరం క్రితం, ఇదే ఏప్రిల్ నెల, 26 వ తేదీనాడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పై 261 పరుగులు ఛేదించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే పంజాబ్ కింగ్స్ పై 246 పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది.
ఆ రోజు ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు
261 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్ల లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో విధ్వంసకారుల్లో మొదటి ఆటగాడు జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 54 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు

