మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. విశ్వంభర (Viswambhara) సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని.. దీన్ని హాలీవుడ్ యాక్షన్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లో చిరంజీవి ఏకంగా ఆరుగురు విలన్లను రాక్షస సంహారం చేస్తాడని.. ఇందుకోసం ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అభిమానులను అబ్బురపరిచేలా ఉంటాయని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని ఇదే సినిమాకి హైలైట్ కాబోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా వాడనున్నారట. ఈ మూవీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా మే 9న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జూలై 24న విశ్వంభర సినిమా విడుదల కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

