కుప్పకూలిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్

by | Apr 11, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది

ఇన్నింగ్స్ ప్రారంభించిన దగ్గర నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో మూడవ వికెట్ కు విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి లు నెలకొల్పిన 43 పరుగులే అత్యుత్తమ భాగస్వామ్యం

31  పరుగులు చేసిన శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. విజయ్ శంకర్ 29 పరుగులు, కాన్వే 12 పరుగులు, రాహుల్ త్రిపాఠి 16 పరుగులు, చేసి అవుట్ అయ్యారు

మిగతా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎవరు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు సరి కదా, రవీంద్ర జడేజా, దీపక్ హుడా లు డక్ అవుట్ అయ్యారు. 7 నుండి 15 ఓవర్ల మధ్య 43 పరుగులకు 5 వికెట్ లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో సునీల్ నరైన్ మూడు వికెట్ లు తీయగా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి లు రెండేసి వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ లు చెరో ఒక వికెట్ తీశారు